India: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న భారత్.. లదాఖ్ ప్రాంతంలో ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణం

చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్‌ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతుంది.

India: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న భారత్.. లదాఖ్ ప్రాంతంలో ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణం

India: చైనా చర్యలకు ప్రతిగా భారత్ రక్షణ ఏర్పాట్లు చేపడుతోంది. దీనిలో భాగంగా చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్‌ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతుంది.

Ayodhya: నేడు అయోధ్యకు 50 లక్షల మంది భక్తుల రాక.. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సరిహద్దులో చైనా అనేక నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా యుద్ధం వంటి పరిస్థితులు వస్తే, విమానాల్ని త్వరగా దించడానికి, ఆయుధాలు, ఇతర సామగ్రి తరలించడానికి వీలవుతుంది. ఈ విషయంపై గతంలో దృష్టిపెట్టని భారత్ ఇప్పుడు వేగంగా చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులో భారీ నిర్మాణాలు చేపడుతోంది. రోడ్ల నిర్మాణంతోపాటు, ఎయిర్‌ఫీల్డ్‌లను నిర్మిస్తోంది. న్యోమాలో నిర్మించనున్న ఎయిర్‌ఫీల్డ్‌ రెండేళ్లలో పూర్తవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే ఇక్కడ యుద్ధ విమానాల్ని, హెలికాప్టర్లను ల్యాండ్ చేసే అవకాశం ఉంటుంది.

North Korea: మరిన్ని అణ్వాయధ క్షిపణులు తయారు చేయండి.. అధికారులను ఆదేశించిన కిమ్

ఆయుధాల్ని, సైనికులకు అవసరమైన మందులు, ఆహారం వంటివి తేలికగా ఇక్కడికి తరలించవచ్చు. 1,235 ఎకరాల్లో, 2.7 కిలోమీటర్ల రన్‌వేతో దీన్ని నిర్మించాల్సి ఉంది. రన్ వేపై రెండు వైపుల నుంచి విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి రూ.214 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దీని నిర్మాణం జరగబోతుంది. న్యోమా.. లేహ్‌కు 180 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.