రికవరీలో ఇండియా నెంబర్ వన్…రాష్ట్రాల వారీగా లెక్కలు

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 11:32 AM IST
రికవరీలో ఇండియా నెంబర్ వన్…రాష్ట్రాల వారీగా లెక్కలు

కరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి దాక వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 42 లక్షల 08 వేల 431కి చేరింది.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల్లో మనమే నెంబర్ వన్. రికవరీల్లో భారత్ వాటా 18.83 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 93 వేల 337 కొత్త కేసులు వచ్చాయి. కోలుకున్న వారి సంఖ్య అంతకంటే 3 వేల 790గా ఎక్కువ. రికవరీ రేటు 79.28 శాతానికి చేరింది. అయితే మరణాలు తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల్లో 1,247 మంది చనిపోయారు.


శనివారం..కేసులు
కేసులు 53,08,014. 24 గంటల్లో 93.337
కోలుకున్న వారు 42,08,431. 24 గంటల్లో 95,880
మరణాలు 85, 619. 24 గంటల్లో 1, 247


రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
మహారాష్ట్ర (24 గంటల్లో) 21,656 (కేసులు). 440 (మరణాలు)
కర్నాటక (24 గంటల్లో) 8,364 (కేసులు). 114 (మరణాలు)
ఉత్తర్ ప్రదేశ్ (24 గంటల్లో) 6,494 (కేసులు). 98 (మరణాలు)
తమిళనాడు (24 గంటల్లో) 5,569 (కేసులు). 66 (మరణాలు)
పంజాబ్ (24 గంటల్లో) 2,801 (కేసులు). 62 (మరణాలు)


ఆంధ్రప్రదేశ్ (24 గంటల్లో) 8,218 (కేసులు). 58 (మరణాలు)
పశ్చిమ బెంగాల్ (24 గంటల్లో) 3,192 (కేసులు). 59 (మరణాలు)
ఢిల్లీ (24 గంటల్లో) 4,127 (కేసులు). 30 (మరణాలు)
మధ్యప్రదేశ్ (24 గంటల్లో) 2,552 (కేసులు). 24 (మరణాలు)
హర్యానా (24 గంటల్లో) 2,488 (కేసులు). 23 (మరణాలు)


ఛత్తీస్ గఢ్ (24 గంటల్లో) 3,842 (కేసులు). 17 (మరణాలు)
రాజస్థాన్ (24 గంటల్లో) 1,817 (కేసులు). 15 (మరణాలు)
అసోం (24 గంటల్లో) 2, 509 (కేసులు). 12 (మరణాలు)
కేరళ (24 గంటల్లో) 4,167 (కేసులు). 12 (మరణాలు)
తెలంగాణ (24 గంటల్లో) 2,123 (కేసులు). 09 (మరణాలు)