Air Travel: కార్మికులకు గుడ్ న్యూస్.. భారత్ నుంచి నేరుగా సౌదీకి..!

లక్షలాది మంది భారతీయ కార్మికులకు ఉపశమనం కలిగించేలా భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది.

Air Travel: లక్షలాది మంది భారతీయ కార్మికులకు ఉపశమనం కలిగించేలా భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విమానాలు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఇరు దేశాల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని ప్రకటించింది.

 

డిసెంబరు 29కి ముందు వరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఇకపై టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే, భారత్ నుంచి సౌదీ అరేబియాకు నేరుగా విమానాల బుకింగ్ ఇప్పటివరకు ప్రారంభించలేదని చెబుతున్నారు. ఇప్పటివరకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో భారతీయులు యూఏఈ, కువైట్, ఒమన్ వంటి దేశాల మీదుగా సౌదీ అరేబియాకు కనెక్టింగ్ ఫ్లైట్‌లు ఎక్కాల్సి వస్తోంది.

ఈ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాదు.. టిక్కెట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే భారత్-సౌదీ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ పెరుగుతాయని అనుకున్నాం కానీ అలా జరగలేదని చెబుతున్నారు.

ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం, కరోనా పరిమితులను అనుసరించి ఇరు దేశాల విమానయాన సంస్థలు భారత్, సౌదీ అరేబియా మధ్య నేరుగా విమానాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. సౌదీ అరేబియాలో భారతదేశం, పాకిస్తాన్ సహా 6 దేశాల పౌరులకు ఈ నిర్ణయం గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఈ దేశాల ప్రజలు ఏ మూడవ దేశంలోనైనా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ కొత్త ఆర్డర్ ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు