Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కేరళలోనే ఎక్కువగా!

దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 14వేల 313కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.

Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. కేరళలోనే ఎక్కువగా!

Corona Cases 11zon

Coronavirus Cases Today: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 14వేల 313కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో 549 మంది చనిపోయారు.

దీంతో మరణాల సంఖ్య 4లక్షల 57 వేల 740కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7వేల 722 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 471 మంది కరోనాతో చనిపోయారు. రికవరీ రేటు 98.19 శాతంగా ఉండగా.. యాక్టివ్‌ కేసులు 0.47 శాతంగా ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో గడిచిన 24గంటల్లో 13వేల 543మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 61 వేల 555గా ఉంది. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 42 లక్షల 60 వేల 470 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో ఇప్పటివరకు 3కోట్ల 36లక్షల 41వేల 175మంది కోలుకున్నారు.

వ్యాక్సిన్‌ సంఖ్య 104 కోట్లు దాటింది
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. నిన్న దేశంలో 56లక్షల 91వేల 175కరోనా డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ఇప్పటివరకు 105కోట్ల 43లక్షల 13వేల 977మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.