Covid-19 Cases: దేశంలో 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇవే!

కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల 786 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి.

Covid-19 Cases: దేశంలో 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇవే!

omicron

Covid-19 Cases: కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల 786 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. అదే సమయంలో 231 మంది చనిపోగా.. మరణాల సంఖ్య నాలుగు లక్షల 53 వేల 42కి చేరుకుంది. దేశంలో 100కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కరోనా వైరస్ కోసం చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య లక్షా 75 వేల 745కి తగ్గింది. అదే సమయంలో 18 వేల 641 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మూడు కోట్ల 35 లక్షల 14 వేల 449 మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో మూడు కోట్ల 41 లక్షల 43 వేల 236 కరోనా కేసులు నమోదయ్యాయి.

వ్యాక్సిన్ సంఖ్య 100 కోట్లు దాటింది
దేశంలో కరోనా వ్యాక్సిన్ సంఖ్య 100 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 100 కోట్ల 59 లక్షల 4 వేల 580 మందికి వ్యాక్సినేషన్ వేశారు. ఇప్పటివరకు దాదాపుగా అందరికీ ఒక డోసు వ్యాక్సినేషన్ అయితే పూర్తయ్యింది. సెకండ్ డోసు వ్యాక్సిన్ ప్రక్రియపై దృష్టిపెట్టాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.