Covid-19: 16 వేలు దాటిన కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు 6.14 శాతం

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు. 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది.

Covid-19: 16 వేలు దాటిన కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు 6.14 శాతం

Covid-19: దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది. కేంద్ర గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 4,41,61,899 మందికి కరోనా సోకింది. 5,26,730 మంది మరణించారు.

Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్‌కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు

ఆదివారం 18,738 కేసులు నమోదు కాగా, సోమవారం కేసుల సంఖ్య తగ్గింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510. యాక్టివ్ కేసుల శాతం 0.31. గడిచిన 24 గంటల్లో 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659. రికవరీ రేటు 98.50గా ఉంది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 6.14 శాతం కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది. ఇప్పటివరకు 87.81 కోట్ల శాంపిళ్లను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 2,63,419 మందికి పరీక్షలు జరిపారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం ఇప్పటివరకు 206 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. వీటిలో 10.88 కోట్ల బూస్టర్ డోసులు కూడా ఉండటం విశేషం.

Odisha: వృద్ధుడిని స్తంభానికి కట్టేసి.. కొట్టి చంపిన కుటుంబ సభ్యులు

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసుల్ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఇటీవలి కాలంలో ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సూచనలు చేసింది. కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించి, అవసరమైన నివారణా చర్యలు చేపట్టాలని సూచించింది.