India Covid-19 Cases : దేశంలో కొత్తగా లక్షా 79 వేల కోవిడ్ కేసులు

దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.

India Covid-19 Cases : దేశంలో కొత్తగా లక్షా 79 వేల కోవిడ్ కేసులు

India covid

India Covid-19 Cases :  దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు. మొన్నటితో పోలిస్తే నిన్న కోవిడ్ కేసులు 12.6 శాతం పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ రోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ప్రస్తుతం దేశంలో 7,23,619 యక్టీవ్ కేసులున్నాయి. భారత్ లో రోజువారీ పాజిటివిటి రేటు 13.29 శాతానికి చేరింది. దేశంలో 2.03 శాతానికి యాక్టీవ్ కేసులు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 3,57,07,727 కేసులు నమోదు కాగా వీరిలో 4,83,936 మంది కోవిడ్ తదితర కారణాలతో మృత్యువాత పడ్డారు.

మహారాష్ట్రలో నిన్న అత్యధికంగా 44,388 కేసులు నమోదు అవ్వగా…. పశ్చిమ బెంగాల్ లో 24,287 ఢిల్లీలో 22,751, తమిళనాడులో 12,895,కర్ణాటకలో 12000 కేసులు,కేరళలో 6238 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

భారత్‌లో కరోన నిర్ధారణ పరీక్షలు 69,15,75,352 కోట్లకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,52,717 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3128 లాబ్స్ కరోనా పరీక్షల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిలో 1,370 ప్రభుత్వ లాబ్స్, 1,758 ప్రైవేట్ లాబ్స్ ఉన్నాయని ఐసీ ఎంఆర్ తెలిపింది.

మరోవైపు Breaking..గత 360 రోజులుగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు, ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోస్ అందించనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నిన్నటి వరకు 151,94,05,951 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. నిన్న 29,60,975 మందికి వ్యాక్సిన్ వేశారు.