AK 203 Rifle : 5 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి కేంద్రం ఆమోదం

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది భారత్.. అమేథీలో ఐదు లక్షలకు పైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది.

AK 203 Rifle : 5 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి కేంద్రం ఆమోదం

Ak 203 Rifle

AK 203 Rifle : రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది భారత్.. అమేథీలో ఐదు లక్షలకు పైగా ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో గల కోర్వా రైఫిల్ ఫ్యాక్టరీలో AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారు చేయనున్నారు. ఇది భారత్, రష్యాల పరస్పర సహకారంతో జరగనుంది.

చదవండి : PM Modi Uttarakhand Tour : నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన..ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఈ అసాల్ట్ రైఫిల్స్ ఇండో – రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి చేయనుంది. 7.62 X 39mm క్యాలిబ‌ర్ క‌లిగిన ఏకే-203 రైఫిళ్లను.. ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో వాడ‌నున్నారు. ఇన్సాస్ రైఫిళ్ల‌ను ఇండియాలో గ‌త మూడు ద‌శాబ్ధాల నుంచి వాడుతున్నారు. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి 70,000 రైఫిల్‌లో రష్యన్ విడిభాగాలు ఉంటాయి. దీని తరువాత ఈ రైఫిల్ పూర్తిగా స్వదేశీ విడిభాగాలను వాడతారు.

చదవండి : PM Modi: నా గోల్ అదే.. కరోనా మహమ్మారిపై మోదీ ప్రకటన!

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏకే-203 అసాల్ట్ రైఫిల్ భద్రతా సిబ్బందికి సురక్షితంగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఏకే-203 సామ‌ర్థ్యం సుమారు 300 మీట‌ర్లు ఉంటుంది. ఈ తుపాకీ బ‌రువు చాలా తేలిక‌గా ఉంటుంది. చాలా సులువైన రీతిలో దీన్ని వాడ‌వ‌చ్చు. ఏకే-203 రైఫిల్‌లో ఉన్న టెక్నిక్ కూడా స‌ర‌ళ‌మైంద‌ని, పోరాటాల వేళ సైనికులు అత్యంత క‌చ్చిత‌త్వంతో ఈ రైఫిళ్ల‌ను వాడ‌వ‌చ్చు అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీని వినియోగం వల్ల సైనికుల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ శాఖవర్గాలు తెలిపాయి.