మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశంలోఇక ఎన్నికలు జరగవు

మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశంలోఇక ఎన్నికలు జరగవు

మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశంలోఇక ఎన్నికలు జరగవు

నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలే ఉండవన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. చైనా, రష్యాలాగా ఎన్నికలు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని గెహ్లాట్ అన్నారు. ఆ రెండు దేశాల్లో ఒకే పార్టీ అధికారం చెలాయిస్తుందని, వాళ్లే ప్రధానులు, అధ్యక్షులు అవుతారని అన్నారు.
అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా మోడీ వెనుకాడరని,దేశం, ప్రజాస్వామ్యం రెండూ ప్రమాదంలో పడ్డాయని గెహ్లాట్ విమర్శించారు. మోడీ మంచి నటుడని, బాలీవుడ్‌లో బాగా రాణిస్తాడని సెటైర్లు వేశాడు. తప్పుడు హామీలు గుప్పించడంలోనూ మోడీ ఆరితేరారని విమర్శించారు.అసలు మోడీ మనసులో ఏముందో అమిత్ షాతోపాటు ఏ పార్టీ నాయకుడికీ తెలియదని గెహ్లాట్ అన్నారు. ప్రజాస్వామ్యంలో సహనం చాలా అవసరమన్నారు.బీజేపీ నాయకులకు ఏ మాత్రం సహనం లేదని,తమను ప్రశ్నించేవారే ఉండకూడదని బీజేపీ నాయకులు అనుకుంటున్నారని,బీజేపీ డీఎన్ఏలోనే సహనం లేదని గెహ్లాట్ ఆరోపించారు.విపక్ష నాయకులను టార్గెట్ చేసేందుకు దర్యాప్తు సంస్థలను మోడీ దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

అయితే మోడీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రధాని అయితే 2024లో దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అంటూ బీజేపీ ఎంపీ సాక్షిమహరాజ్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

×