India Corona : దేశానికి పొంచి ఉన్న మరో ముప్పు.. ఏ నెలలో వస్తుందంటే…

దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది

India Corona : దేశానికి పొంచి ఉన్న మరో ముప్పు.. ఏ నెలలో వస్తుందంటే…

India Corona

India Corona : దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. అప్పటిలోగా వీలైనంత మందికి టీకాలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశం పూర్తిగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లతో ఇప్పటివరకూ పెద్దలే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. కానీ థర్డ్ వేవ్ లో చిన్నారులకే ఎక్కువగా ప్రభావం ఉంటుందన్న నిపుణుల హెచ్చరికలతో తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఈ మహమ్మారిని పెద్దలే తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. మరి చిన్నారులు తట్టుకోగలరా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేశమంతా థర్ట్ వేవ్ టెన్షన్ నెలకొంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. మొదటి వేవ్ కొన్ని నెలల పాటు కొనసాగింది. సెకండ్ వేవ్ కూడా కొన్ని నెలలగా కొనసాగుతూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఇది ఊరటనిచ్చే అంశమే. హమ్మయ్య అని రిలాక్స్ అయ్యే లోపే థర్డ్ వేవ్ గుబులు పట్టుకుంది. అదీ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే నిపుణుల హెచ్చరికలు మేరకు ప్రభుత్వాలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నాయి. బెడ్స్, ఆక్సిజన్, మందులు.. అందుబాటులో ఉంచుకున్నాయి. అలాగే ప్రత్యేకంగా చిన్నారుల కోసం వార్డులను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవటానికి అన్ని ఏర్పాట్లు చేశాయి. కానీ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న చాలా మంది చిన్నారుల్లో కొత్త వ్యాధి సమస్యగా మారింది. అదే ‘మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్’.