Third-largest economy: ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్: మోర్గాన్ స్టాన్లీ

ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ దూసుకువెళ్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. భారత్ 2030లోగా ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించింది. తయారీ రంగంలో పెట్టుబడులు, ఇంధన రంగంలో మార్పులు, అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ దూసుకువెళ్తుందని తెలిపింది. ‘ఈ దశాబ్దం భారత్‌దే.. ఎందుకంటే..?’ పేరిట మోర్గాన్ స్టాన్లీ ఈ నివేదిక విడుదల చేసింది.

Third-largest economy: ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారత్: మోర్గాన్ స్టాన్లీ

Third-largest economy: ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ దూసుకువెళ్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. భారత్ 2030లోగా ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించింది. తయారీ రంగంలో పెట్టుబడులు, ఇంధన రంగంలో మార్పులు, అధునాతన డిజిటల్ మౌలిక సదుపాయాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ దూసుకువెళ్తుందని తెలిపింది. ‘ఈ దశాబ్దం భారత్‌దే.. ఎందుకంటే..?’ పేరిట మోర్గాన్ స్టాన్లీ ఈ నివేదిక విడుదల చేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ తీరు, విధానాలు, భవిష్యత్తు వంటి అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికలో పలు అంశాలు తెలిపింది. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ శక్తిమంతం అవుతోంది. ఇటువంటి విలక్షణమైన మార్పులు ఒక్కో తరంలో ఒక్కోసారి మాత్రమే చోటుచేసుకుంటాయి. అలాగే, పెట్టబడిదారులకు, సంస్థలకు ఇదో మంచి అవకాశం. జనాభా, డిజిటలైజేషన్, డీకార్బొనైజేషన్, డీగ్లోబలైజేషన్ న్యూ ఇండియా ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉన్నాయి’’ అని తెలిపింది.

ఈ దశాబ్దంలో ప్రపంచ వృద్ధిలో భారత్ ఐదో స్థానంలో నిలుస్తుందని చెప్పింది. కుటుంబ ఆదాయం కూడా ఐదు రెట్టు పెరగనుందని వివరించింది. భారత తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.1,88,414గా ఉందని, 2031లోపు అది రూ.4,33,555కి పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పింది. కాగా, ప్రస్తుతం ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా వరుసగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్ ఉన్నాయి. యూకేను ఆరో స్థానంలోకి నెట్టేసి భారత్ ఐదో స్థానంలోకి దూసుకు వెళ్లింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..