‘ఇండియా, పాక్, బంగ్లాదేశ్‌ను కలపాల్సిందే’

‘ఇండియా, పాక్, బంగ్లాదేశ్‌ను కలపాల్సిందే’

Nawab Malik: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కలపాల్సిందేనని.. అలా చేయడానికి బీజేపీ ముందుకొస్తే తమ పార్టీకి సమ్మతేమనని అంటున్నాడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి నవాబ్ మాలిక్. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవిస్ కరాచీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాలిక్ ఇలా అన్నారు.

‘దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినట్లుగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను విలీనం చేస్తామంటే దానిని వెల్ కమ్ చేస్తాం. బెర్లిన్ గోడను కూల్చినప్పుడు లేనిది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కలిపితే సమస్య ఏముంది. ఒకవేళ బీజేపీ ఈ మూడు దేశాలను ఒక్కటి చేయాలనుకుంటే మా పార్టీ కచ్చితంగా స్వగతిస్తుంది’ అని మాలిక్ అన్నారు.



బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేనతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ‘బీఎంసీ ఎన్నికలకు ఇంకా 15నెలల సమయం ఉంది. ప్రతి ఒక్కరికీ పార్టీ కోసం పనిచేయాల్సిన పని ఉంది. మేం కూడా మా పార్టీని బలోపేతం చేస్తున్నాం’ అని వెల్లడించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం లాక్‌డౌన్ అమలు చేయాల్సిన అవసరం లేదు. ‘మా ఆరోగ్య సెక్రటేరియట్ ప్రతి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ గురించి ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటుంది. కరోనా వైరస్ గురించి బయటపడటంలో మేం సక్సెస్ అయ్యాం. కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు అమలుచేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో అలా కాదు. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి లాక్ డౌన్‌ను ఎత్తేయాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు.