Vaccination : టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు

వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతుంది. సోమవారం నాటికి అమెరికాను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలించింది. ఆదివారం వరకు అత్యధిక వ్యాక్సిన్స్ ఇచ్చిన దేశాల లిస్ట్ లో అమెరికా సెకండ్ ప్లేస్ లో ఉండగా సోమవారం భారత్, అమెరికాను వెనక్కు నెట్టింది. భారత్ 32.8 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ ఇవ్వగా అమెరికా 32.3 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ ఇచ్చింది.

10TV Telugu News

Vaccination : వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతుంది. సోమవారం నాటికి అమెరికాను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలించింది.
ఆదివారం వరకు అత్యధిక వ్యాక్సిన్స్ ఇచ్చిన దేశాల లిస్ట్ లో అమెరికా సెకండ్ ప్లేస్ లో ఉండగా సోమవారం భారత్, అమెరికాను వెనక్కు నెట్టింది. భారత్ 32.8 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ ఇవ్వగా అమెరికా 32.3 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ ఇచ్చింది.

గత గతేడాది డిసెంబర్ 14న అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, ఆ తర్వాత నెలకి అనగా జనవరి 16 తేదీ నుంచి భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట్లో వ్యాక్సిన్ కొరతతో ఇబ్బంది పడిన భారత్ రాను రాను ఉత్పత్తిని పెంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంగం చేసింది. భారత్ లో సోమవారం 50 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై ప్రధాని మోదీ ట్విట్టర్ లో స్పందించారు. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుందని తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరిని అభినందించారు.

ఇక ప్రపంచ దేశాల్లోని వ్యాక్సినేషన్ వివరాలను ఓ సారి పరిశీలిస్తే

చైనా 119 కోట్ల మందికి టీకా పంపిణి చేసి మొదటి స్థానంలో ఉండగా భారత్ 32.8 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించింది. అమెరికా 32.3 కోట్లు, బ్రెజిల్ 9.7 కోట్లు, యూకే 7.7 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. భారత్ లో రెండు డోస్ లు తీసుకున్నవారు 5.5 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభా పరంగా చూస్తే దేశంలో రెండు డోస్ లు తీసుకున్న వారు 4% మంది. ఇక అమెరికా విషయానికి వస్తే అమెరికాలో రెండు డోస్ లు తీసుకున్న వారి సంఖ్య 15.3 కోట్లగా ఉంది. ఇది ఆ దేశ జనాభాలో 46.6% శాతం.

×