Vaccination : టీకా వితరణలో భారత్ సరికొత్త రికార్డు.. 95 కోట్లమందికి టీకా పూర్తి

కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా 95 కోట్లమందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించారు.

Vaccination : టీకా వితరణలో భారత్ సరికొత్త రికార్డు.. 95 కోట్లమందికి టీకా పూర్తి

Vaccination

Vaccination : కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఆదివారానికి దేశ వ్యాప్తంగా 95 కోట్లమందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించారు. జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేష ప్రక్రియ దేశ వ్యాప్తంగా శరవేగంగా సాగుతోంది. మొదట్లో టీకా కొరత వచ్చినా దానిని అధిగమించింది భారత్. ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Read More :  ఏపీలో కరోనా కేసులు..624 మందికి వైరస్

త్వరలోనే 100 కోట్ల మైలురాయిని చేరుకుంటామని తెలిపారు. ఇక రాష్ట్రాల వద్ద 8,28,73,425 డోసులు బ్యాలెన్స్ ఉన్నాయని మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను వేగవంతం చేయడానికి, విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Read More :   కొవిడ్ ఎఫెక్ట్.. వింత సమస్యతో రెండు నెలలుగా మలద్వారం..