BrahMos missiles: ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులు, అదే బాటలో అరబ్ దేశాలు

దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి ఫిలిప్పీన్స్ దేశం నుంచి రూ.2,780 కోట్ల విలువైన ఆర్డర్ ను బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ అందుకున్న భారత్

BrahMos missiles: ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ క్షిపణులు, అదే బాటలో అరబ్ దేశాలు

Brahmos

BrahMos missiles: ఆయుధాల దిగుమతిని తగ్గించి, ఎగుమతుల దిశగా ఎదగాలన్న భారత ఆకాంక్షకు మొదటి అడుగుపడింది. క్షిపణుల ఎగుమతిలో ఫిలిప్పీన్స్ దేశంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ దేశం నుంచి మొట్టమొదటి ఆర్డర్ ను భారత ప్రభుత్వం అందుకుంది. రష్యా సహకారంతో భారత రక్షణశాఖ ఆద్వర్యంలోని డీఆర్డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి ఫిలిప్పీన్స్ దేశం నుంచి రూ.2,780 కోట్ల విలువైన ఆర్డర్ ను బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ అందుకున్నట్లు ఇరు దేశాల రక్షణశాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. దీంతో క్షిపణులను ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల సరసన భారత్ కూడా చేరింది. “ప్రభుత్వం నుంచి ప్రభుత్వం పద్దతిలో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు..క్షిపణుల కొనుగోలు నిమిత్తం ‘నోటీస్ ఆఫ్ అవార్డ్’పై అతి త్వరలో(జనవరి చివరి వారం) సంతకం చేయనున్నట్లు” ఫిలిప్పీన్స్ జాతీయ రక్షణ కార్యదర్శి డెల్ఫిన్ లోరెంజానా ప్రకటించారు.

Also read: UP Elections: గోరఖ్‌పూర్ నుంచి యోగిని బరిలో దించడంపై బీజేపీ మాస్టర్ ప్లాన్

ఫిలిప్పీన్స్ తరువాత భారత్ నుంచి క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఇతర ఆసియాన్(ASEAN) సభ్య దేశాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఈమేరకు ఇండోనేషియా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్‌లతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇక దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు కూడా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలుచేసేందుకు ఆసక్తి కనబరిచాయి. యుద్ధం అనివార్యం అయినపుడు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ నుంచి ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలుచేసేందుకు ఆయా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: Pakistan: ఇమ్రాన్ వచ్చాక మరింత దిగజారిన పాక్ పాసుపోర్టు విలువ

ఇక ఆసియాన్ దేశాల బాటలోనే అరబ్ దేశాలూ భారత్ తో క్షిపణులు కొనుగోలు ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే యూఏఈ(దుబాయ్)తో చర్చలు పురోగతి స్థాయిలో ఉన్నాయి. భారత్ నుంచి బ్రహ్మోస్, ఆకాష్ మిస్సైల్స్ ను కొనుగోలు చేసేందుకు యూఏఈ ఆసక్తిగా ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కరోనా కారణంగా ఇరు దేశాల మధ్య క్షిపణి ఒప్పందాలు నిలిచిపోగా..ఈ ఏడాదిలో అవి కార్యరూపం దాల్చనున్నాయి. ఇక మరో అరబ్ దేశం సౌదీ అరేబియా సైతం భారత్ నుంచి క్షిపణులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన రక్షణశాఖ ఎక్స్పోకి వెళ్లిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల రక్షణశాఖ అధికారులతో ఈమేరకు ఫలవంతమైన చర్చలు జరిపారు. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దక్షిణ అమెరికా దేశాలకు కూడా భారత తయారీ క్షిపణులు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం బ్రెజిల్, చిలీ మరియు అర్జెంటీనా దేశాలు భారత రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Also read: Tesla : తెలంగాణలో టెస్లా కేంద్రాన్ని నెలకొల్పండి.. కేటీఆర్ ఆహ్వానం