COVID-19 Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. ఒకేరోజు 26మంది మృతి

ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 26 మంది మరణించారు.

COVID-19 Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. ఒకేరోజు 26మంది మృతి

Covid 19 Cases

COVID-19 Cases: దేశంలో కొవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం చూస్తే.. కొవిడ్ కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. పాజిటివిటీ రేటు 5.99శాతానికి పెరిగింది.

Telanganan Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే?

ఇదిలాఉంటే ఇప్పటి వరకు దేశంలో 86.68 కోట్ల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,30,713 (0.30%)గా మోదైంది. గడిచిన 24గంటల్లో 14,629 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు. దేశంలో 2020 నుంచి 4.36కోట్ల మందికి కొవిడ్ సోకగా.. రికవరీ రేటు 98.50శాతంగా ఉంది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

ఆదివారం ఒక్కరోజే కొవిడ్ తో చికిత్స పొందుతూ 26మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 198.88 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను వైద్య సిబ్బంది అందించారు.