Corona New Cases: భారత్‌కు ఊరట.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

మూడో వేవ్ నుంచి ఎట్టకేలకు ఉపశమనం కలగవచ్చు అనే ఆశలు మళ్లీ చిగురించాయి. కరోనా స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి.

Corona New Cases: భారత్‌కు ఊరట.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

Eye Problem In Corona

Corona New Cases: మూడో వేవ్ నుంచి ఎట్టకేలకు ఉపశమనం కలగవచ్చు అనే ఆశలు మళ్లీ చిగురించాయి. కరోనా స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. ఊహించినట్లుగా కేసుల సంఖ్య పెరగకుంగా తగ్గుముఖం పడుతోంది. ఈ వారంలో కరోనా దుమ్మురేపుతోందని అందరూ భావించిన అంచనాలు తప్పు అవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశంలో 2 లక్షల 55 వేల 874 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 614 మంది మరణించారు. సోమవారంతో పోలిస్తే కొత్త కరోనా కేసుల్లో 16 శాతం తగ్గుదల నమోదైంది. దీంతో పాజిటివిటీ రేటు 20.75 శాతం నుంచి 15.52కి తగ్గింది. ఇదే సమయంలో 2 లక్షల 67 వేల 753 మంది కోలుకున్నారు.

దీంతో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3 కోట్ల 70 లక్షల 71 వేల 898కి చేరుకుంది. దేశంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా రోగుల సంఖ్య ఇప్పుడు 22 లక్షల 36 వేల 842కి పెరిగింది. వైరస్‌ హోరు తగ్గడంతో కరోనా ప్రవాహంలో కొట్టుమిట్టాడుతోన్న భారత్‌కు కాస్త ఊరట లభించినట్లయింది. వరుసగా నాలుగో రోజూ కేసుల సంఖ్య తగ్గింది. ఇంత భారీ స్థాయితో కేసులు తగ్గుతాయని ఎవరూ ఊహించలేదు.

కేసుల తగ్గుదలను బట్టి చూస్తుంటే.. రాబోయే రెండు వారాల్లో కేసుల ఉధృతి బాగా తగ్గుతుందని కేంద్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి చాలావరకు కేసులు అదుపులోకి వస్తాయని, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పకడ్బందీగా సాగుతుండడంతో మూడో వేవ్ ప్రభావం తగ్గిందని చెబుతున్నాయి.

గడిచిన వారం రోజులుగా కొత్త కేసులు 3 లక్షలపైగా నమోదవుతుండగా.. ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి కరోనా కేసులు. దీని ప్రకారం చూస్తుంటే ఫిబ్రవరి 15వ తేదీ నాటికి కొవిడ్ కేసులు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. భారత్‌లో గతేడాది సెకండ్‌వేవ్‌ పీక్‌లో ఉన్నప్పుడు 50 ల‌క్షల వ‌ర‌కూ యాక్టివ్ కేసులు వెళ్లాయి. అయితే ఇప్పుడు మాత్రం పీక్‌లో 30లక్షల వరకు మాత్రమే యాక్టీవ్ కేసులు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.