India Corona: ఒక్కరోజులో దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

India Corona: ఒక్కరోజులో దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు

Corona

Corona Update: భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,79,01,241కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 18,31,000కి చేరింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతానికి చేరుకుంది. మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా 1,88,157 మంది కరోనా నుంచి కోలుకోగా, మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,55,83039కి చేరింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి భారిన పడి 441 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,87,202కి చేరింది.

Also read” Indian Navy: ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో పేలుడు, ముగ్గురు మృతి 11 మందికి గాయాలు

ఇక ఇప్పటి వరకు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు 70.74 కోట్లు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 18,69,642 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 3170 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 158.88 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది.

Also read: Work from Home: ఆఫీసు కుర్చీని ఇంటికి తీసుకెళ్లడం ఉద్యోగం తొలగించేంత నేరం కాదు