Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 3824 కొత్త కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం 184 రోజుల తరువాత ఇదే తొలిసారి.

Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 3824 కొత్త కేసులు

Corona virus

Covid-19: దేశంలో కరోనా వైరస్ విజృంభణ మొదలైనట్లు కనిపిస్తోంది. రోజురోజుకు కొవిడ్ -19 పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 184 రోజుల్లో ఈస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. ఇదిలాఉంటే.. గత పదిరోజులుగా కొత్త పాజిటివ్ కేసులసంఖ్య భారీగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ వ్యాప్తి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్రం సూచించిన ఆదేశాలను పాటించాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది.

Covid-19: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 3,016 కేసులు నమోదు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ..

హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుయంజా కేసులు వ్యాప్తి చెందడంతో భారత్‌లో గత కొద్దిరోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కి చేరింది. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.04 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంకు పెరగగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,73,335కు పెరిగింది. గడిచిన 24గంటల్లో కోవిడ్ వల్ల ఐదుగురు మరణించారు. దీంతో కోవిడ్ మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది.

COVID-19: ఐదు నెలల తరువాత గరిష్ఠ స్థాయిలో.. ఒకేరోజు 2వేలకు‌పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

ఢిల్లీలో కోవిడ్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దేశ రాజధానిలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆస్పత్రుల్లో చేరిన కోవిడ్ రోగులు ఎక్కువగా వృద్ధులు, కోమోర్బిడ్ పరిస్థితులతో బాధపడుతున్నవారేనని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.