COVID-19 infections: దేశంలో 1,848కు పెరిగిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆ వైరస్ నియంత్రణలో ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో కొత్తగా 80 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం తెలిపింది. ఆసుపత్రులు/ హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,848కు పెరిగిందని వివరించింది.

COVID-19 infections: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ భారత్ లో ఆ వైరస్ నియంత్రణలో ఉండడం దేశ ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో కొత్తగా 80 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం తెలిపింది. ఆసుపత్రులు/ హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1,848కు పెరిగిందని వివరించింది.
ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం కలిపి 4.46 (4,46,82,719) కోట్లకు చేరిందని వివరించింది. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,30,740కు చేరిందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.11 శాతంగా నమోదైందని తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.08 శాతంగా ఉన్నట్లు వివరించింది.
మొత్తం ఇన్ఫెక్షన్లలో పాజిటివ్ రేటు ప్రస్తుతం 0.01 శాతం ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు 98.81 శాతానికి పెరిగినట్లు తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,50,131కు చేరినట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 220.45 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లను వినియోగించారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
Suryakumar Yadav: నా పొరపాటు వల్లే వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాడు: సూర్య