India Omicron Cases : భారత్‌లో 173 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది.  సోమవారం ఉదయానికి  మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.

India Omicron Cases : భారత్‌లో 173 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

India Omicron Cases

India Omicron Cases :  దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది.  సోమవారం ఉదయానికి  మొత్తం 173 కేసులు నమోదయ్యాయి. దేశంలోని 10 రాష్ట్రాలు,2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల గుర్తించారు.  డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఒమిక్రాన్‌ కేసులపై ప్రత్యేకంగా దృషి పెట్టారు.

భారత్ లో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 28, తెలంగాణ లో 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ 17,కర్ణాటక 19,కేరళ 15,గుజరాత్ 11, ఉత్తరప్రదేశ్ 2,చండిఘడ్ 1,తమిళనాడు 1,పశ్చిమ బెంగాల్ 4,ఏపీలో 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.
Also Read : Namma Metro : ఉదయం 5 నుంచి మెట్రో రైలు సేవలు… ఎక్కడంటే….

మరో వైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శనివారం 7,081 కేసులు నమోదు కాగా, ఆదివారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. ఇక కరోనాతో గడిచిన 24 గంటల్లో 132 మంది మరణించినట్లుగా పేర్కొంది. గత కొంతకాలంగా కరోనా కేసుల కంటే రికవరీ రేటే అధికంగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 8,077 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.గడిచిన 572 రోజుల్లో ఇదే తక్కువ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 137.67 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది.