Omicron Variant : దేశంలో 41కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం

దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు.

Omicron Variant : దేశంలో 41కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం

Omicron Variant

Omicron Variant : దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు. సోమవారం మహారాష్ట్రలో రెండు కేసులు, గుజరాత్ లో ఓ ఒమిక్రాన్ కేసు నమోదైంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. గుజరాత్ సూరత్‌కు చెందిన వ్యక్తి తాజాగా దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి వచ్చారు.

చదవండి : : Omicron Variant: పాకిస్తాన్‌లో ఫస్ట్ ఒమిక్రాన్‌ కేసు

ఎయిర్ పోర్టులో నిర్వహిస్తున్న పరీక్షల్లో చాలామందికి కరోనా నెగటివ్ వస్తుంది. తర్వాత ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఆసుపత్రికి వెళ్తే కానీ తెలియడం లేదు కరోనా సోకినట్లుగా. తాజాగా మహారాష్ట్రలో 12 ఏళ్ల బాలిక కరోనా కొత్త ఒమిక్రాన్ బారిన పడింది. తాజాగా వారి ఫ్యామిలి నైజీరియా నుంచి మహారాష్ట్రకు వచ్చింది. దేశానికి వచ్చిన సమయంలో వారందరికీ పరీక్షలు నిర్వహించారు. కానీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లడంతో ఆర్టీపీసీఆర్ చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో పరీక్షలు చేయించగా ఆమెకు కరోనా నిర్దారణ అయింది. వెంటనే జ‌న్యు ప‌రీక్ష‌లు చేయగా ఆమెకు ఒమిక్రాన్ నిర్దారణ అయింది.

చదవండి : :Omicron Detection : పంటినొప్పి చికిత్స కోసం వెళ్లిన 12ఏళ్ల బాలికకు ఒమిక్రాన్!

ఈ రాష్ట్రంలో ఎన్ని ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయన్న విషయాన్నీ ఒకసారి పరిశీలిస్తే..

మహారాష్ట్ర – 20, రాజస్థాన్ – 9, గుజరాత్ 4, కర్ణాటక 3, ఢిల్లీలో 2, చండిఘడ్ 1, కేరళ 1, ఏపీలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 41 కేసులు నమోదయ్యాయి. 8 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.