ప్రపంచంలోనే తక్కువ : భారత్ లో లక్ష జనాభాకి 0.3 కరోనా మరణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 26, 2020 / 01:03 PM IST
ప్రపంచంలోనే తక్కువ : భారత్ లో లక్ష జనాభాకి 0.3 కరోనా మరణాలు

ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం(మే-26,2020)ప్రకటించింది. ప్రస్తుతం మరణాల రేటు 2.87శాతంగా ఉందని తెలిపింది. భారత్ లో 1లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్లు తెలిపింది. 1లక్ష జనాభాకి 4.4మరణాలను ప్రపంచం నమోదుచేస్తుంటే..భారత్ మాత్రం 0.3మరణాలను మాత్రమే నమోదుచేస్తున్నట్లు తెలిపింది.

బెల్జియం వంటి కొన్ని దేశాలు 1లక్ష జనాభాకు అత్యధికంగా 81.2మరణాలను నమోదుచేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చర్యలు తీసుకోవడం,లాక్ డౌన్ విధించడం,కోవిడ్-19 కేసుల నిర్వహణ కారణంగానే ఇది సాధ్యమైందనిఅగర్వాల్ చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 60,490మంది కరోనా నుంచి కోలుకున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు. రికవరీ రేటు మెరుగుపడుతుందన్నారు.

ప్రస్తుతం రికవరీ రేటు 41.61శాతంగా ఉందన్నారు. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వచ్చేవరకూ అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించడం,వైరస్ సోకకుండా ఇతర ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా సోషల్ వ్యాక్సిన్ గా సోషల్ డిస్టెన్స్ ను పాటించడం కొనసాగించానలి అగర్వాల్ కోరారు.

మరణాల రేటు విషయంలో…దేశంలో తక్కువ మరణాల రేటు నమోదవడం చాలా మంచిదని, ఈ విషయంపై కొన్ని ఊహాగానాలు ఉన్నాయని,అయితే ఏ కారకంపై మనం సృష్టంగా చెప్పలేం అని…ఇది కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నట్లు ICMR డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. కరోనా వైరస్ టెస్ట్ ల సంఖ్య మరింత పెరిగినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రోజుకి 1.1లక్షల మందికి టెస్ట్ లు చేస్తున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 1లక్షా 50వేలకు చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 4వేలు దాటింది. దేశంలో అత్యధికంగా 52వేలకు పైగా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.