Coronavirus Update: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా యాక్టీవ్ కేసులు

భారత్‌లో 266రోజుల కనిష్టానికి చేరాయి కరోనా యాక్టీవ్ కేసులు

Coronavirus Update: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా యాక్టీవ్ కేసులు

Corona Virus

Coronavirus Update: భారత్‌లో 266రోజుల కనిష్టానికి చేరాయి కరోనా యాక్టీవ్ కేసులు. దేశంలో కొత్తగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 332మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో లక్షా 40వేల 638 యక్టీవ్ కేసులు ఉండగా.. దేశంలో యాక్టివ్ కేసులు 0.42 శాతంగా ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 3కోట్ల 43లక్షల 77వేల 113 కేసులు నమోదవగా.. 4లక్షల 61వేల 389మంది చనిపోయారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.24 శాతంగా ఉంది. కరోనా నుంచి 11వేల 982 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 3కోట్ల 37లక్షల 75వేల 86 మంది కోలుకున్నారు.

భారత్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు 61.72 కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10లక్షల 85వేల 848 టెస్టులు నిర్వహించగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61కోట్ల 72లక్షల 23వేల 931 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3025 లాబ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 116.89 కోట్ల డోసుల వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇచ్చింది కేంద్రం. రాష్ట్రాల దగ్గర అందుబాటులో లెక్కల ప్రకారం.. 15.92 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇంకా రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 116,89,46,235 డోసులను రాష్ట్రాలకు కేంద్రం అందించింది.