H3N2 cases: జనవరి 1 నుంచి మార్చి 21 వరకు 1,317 హెచ్3ఎన్2 కేసులు: కేంద్రం

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో 510 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయని భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వారిలో 19 మంది రోగులు ఐసీయూలో చేరారని పేర్కొన్నారు.

H3N2 cases: జనవరి 1 నుంచి మార్చి 21 వరకు 1,317 హెచ్3ఎన్2 కేసులు: కేంద్రం

H3N2 cases

H3N2 cases: దేశంలో జనవరి 1 నుంచి మార్చి 21 వరకు 1,317 హెచ్3ఎన్2 (H3N2) కేసులు నమోదయ్యాయని రాజ్యసభ (Rajya Sabha)కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో 510 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయని భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వారిలో 19 మంది రోగులు ఐసీయూలో చేరారని పేర్కొన్నారు. హెచ్3ఎన్2 (H3N2) సహా ఇన్‌ఫ్లుయెంజా కేసులను ఎదుర్కోవడానికి, నివారించడానికి రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. హెచ్3ఎన్2 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు కూడా చేస్తున్నామని చెప్పారు.

కాగా, కరోనా నుంచి పూర్తిగా బటయపడక ముందే దేశంలోని పలు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 (H3N2) కేసులు వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. హెచ్3ఎన్2 (H3N2) కేసుల నివారణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకుంటున్నాయి.

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలకు పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందాయి: అమెరికా