Corona Cases : కొత్తగా 15,906 కరోనా కేసులు.. 561 మంది మృతి

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఓ రోజు పెరుగుతూ మరో తగ్గుతూ వస్తుంది. ఇక చాలా రాష్ట్రాల్లో 1000కి దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Corona Cases : కొత్తగా 15,906 కరోనా కేసులు.. 561 మంది మృతి

Corona Cases

Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య ఓ రోజు పెరుగుతూ మరో తగ్గుతూ వస్తుంది. ఇక చాలా రాష్ట్రాల్లో 1000కి దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మాత్రం కరోనా తీవ్రత అధికంగా ఉంది. మొదటి నుంచి ఈ రాష్ట్రంలో కరోనా సంఖ్య అధికంగానే ఉంది. కేరళలో వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా బారినపడతుండటంతో ఆందోళన కలిగిస్తుంది.

చదవండి : AP Corona : రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు తగ్గిన కరోనా కేసులు

ఇదిలా ఉంటే దేశంలో కొత్తగా 15,906 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,75,468కి చేరింది. ఇందులో 1,72,594 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,35,48,605 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,54,269 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 16,479 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 561 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

చదవండి : Corona Cases : దేశంలో కొత్తగా 16,326 కరోనా కేసులు, 666 మరణాలు