Coronavirus Update: దేశంలో తగ్గిన యాక్టీవ్ కరోనా కేసులు.. లేటెస్ట్ లెక్కలు ఇవే!

భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

Coronavirus Update: దేశంలో తగ్గిన యాక్టీవ్ కరోనా కేసులు.. లేటెస్ట్ లెక్కలు ఇవే!

Corona Cases 11zon

Covid-19 Cases Update: భారతదేశంలో కరోనా వినాశనం ఇంకా పూర్తిగా ముగియలేదు. ప్రతిరోజూ దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. లేటెస్ట్ లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 10వేల 229కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 125మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24గంటల్లో 11,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో నమోదైన కేసుల్లో సగం కంటే ఎక్కువ కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో మొత్తం 5వేల 848 కేసులు నమోదు కాగా, 46 మంది చనిపోయారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం మూడు కోట్ల 44 లక్షల 47 వేల మందికి కరోనా సోకింది. వీరిలో 4 లక్షల 63 వేల 655 మంది మరణించారు. ఇప్పటివరకు 3 కోట్ల 38 లక్షల 49 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,096గా ఉంది.

దేశంలో కరోనా మరణాల రేటు 1.35 శాతం కాగా, రికవరీ రేటు 98.26 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.39%. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 18వ స్థానంలో ఉంది. కరోనా సోకిన వారి సంఖ్య పరంగా భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారత్‌ కంటే అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

112 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు..
వ్యాక్సినేషన్ విషయంలో కూడా భారత్ ఏమాత్రం తగ్గట్లేదు. నవంబర్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 112కోట్ల 34లక్షల 30వేల డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చివరి రోజు 30.2 లక్షల వ్యాక్సిన్‌లు వేసింది ప్రభుత్వం. అదే సమయంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, ఇప్పటివరకు 63 కోట్ల కరోనా పరీక్షలు జరగగా.. చివరి రోజు 10 లక్షల కరోనా పరీక్షలు జరిగాయి, వీరిలో పాజిటివిటీ రేటు ఒక్క శాతం కంటే తక్కువగా ఉంది.