Coronavirus: దేశంలో సగం కేసులు కేరళలోనే.. పెరిగిన కరోనా మరణాలు

దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా సాగుతోంది. మరణాలు మాత్రం ఎక్కువగా నమోదవుతున్నాయి.

Coronavirus: దేశంలో సగం కేసులు కేరళలోనే.. పెరిగిన కరోనా మరణాలు

Telangana Covid Cases

Coronavirus: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా సాగుతోంది. మరణాలు మాత్రం ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 13 వేల 451 కొత్త కరోనా కేసులు నమోదవగా.. అదే సమయంలో 585 మంది చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 4 లక్షల 55 వేల 653కి చేరుకుంది.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 14 వేల 21 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 62 వేల 661గా ఉంది. దేశంలో ఇప్పటివరకు 3కోట్ల 42 లక్షల 15 వేల 653 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 3కోట్ల 35లక్షల 97వేల 339మంది కోలుకున్నారు.

కరోనా కేసులు- మూడు కోట్ల 42 లక్షల 15 వేల 653
కోలుకున్నవారు – మూడు కోట్ల 35 లక్షల 97 వేల 339
మొత్తం యాక్టివ్ కేసులు – ఒక లక్ష 62 వేల 661
చనిపోయినవారు- నాలుగు లక్షల 55 వేల 653
వ్యాక్సినేషన్ – 103 కోట్ల 53 లక్షల 25వేల 577 డోసులు

కేరళలో 7,163 కొత్త కరోనా కేసులు:
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా కేరళలో మాత్రం కొత్తగా 7వేల 163 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో, 90మంది కరోనా కారణంగా చనిపోయారు.

వ్యాక్సినేషన్:
అక్టోబర్ 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 103 కోట్ల 53 లక్షల 25వేల 577 డోసుల కరోనా వ్యాక్సిన్‌లు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.