Corona Cases : కరోనా బులిటెన్ విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది.

Corona Cases : కరోనా బులిటెన్ విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

omicron

Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 3,40,67,719కు చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,52,124 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి బయటపడగా, 144 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

చదవండి : India Corona : కరోనా బులిటెన్ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఇక కేరళలో 7955 కరోనా కేసులు నమోదు కాగా 57 మంది మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 41,20,772 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తంగా 97,65,89,540 కరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. రాష్ట్రాలకు ఇప్పటివరకు 101.7 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశామని పేర్కొంది.

చదవండి : Corona : దేశంలో కరోనా తగ్గినట్లేనా? 27 రాష్ట్రాల్లో తగ్గుముఖం.. కేరళలో మాత్రం