Coronavirus: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా.. |India reports 2364 new cases, 10 deaths in last 24 hours

Coronavirus: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా..

శంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొవిడ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

Coronavirus: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా..

Coronavirus: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొవిడ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న (బుధవారం) 1,862 కేసులు నమోదవగా.. తాజాగా ఆ సంఖ్య 2,364కు పెరిగింది. బుధవారం 4.77లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ తో చికిత్స పొందుతూ 2,582 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 4.31కోట్ల మంది కొవిడ్ బారిన పడగా.. చికిత్స పొందుతూ 4.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 15,419(0.04శాతం)గా ఉంది.

Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

బుధవారం కొవిడ్ తో చికిత్స పొందుతూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ రెండేళ్ల కాలంలో 1,91,79,96,905 డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం ఒక్కరోజు 13,71,603 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇదిలా ఉంటే కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో 532 ఉండగా, కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్ లో 139 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 77.45శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

×