India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది...

India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..

Coronavirus

India Corona: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది. ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. వారంరోజుల క్రితం వరకు కొవిడ్ వ్యాప్తి తగ్గింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వెయ్యి లోపు నమోదయ్యాయి. వారం రోజుల నుంచి కొవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో మరోసారి కొవిడ్ వ్యాప్తి పెరుగుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

Corona Cases : భారత్ లో మళ్లీ కరోనా పంజా.. కొత్తగా ఎన్ని కేసులంటే!

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. బుధవారం 3,010 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసులు 19, 719(0.05)కి పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో కొవిడ్ తో చికిత్స పొందుతూ 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్లకు పైగా కేసులు రాగా 5.23 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను ముమ్మరం చేసింది. కాగా బుధవారం 13.98 లక్షల మంది టీకా వేయించుకోగా, మొత్తం ఇప్పటి వరకు 189 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో 1,354 మందికి వైరస్ సోకగా, పాజిటివిటీ రేటు 7.64 శాతానికి పెరిగింది. ముంబయిలో 117 కేసులు రాగా ఫిబ్రవరి 24 తరువాత ఇవే అత్యధికం కావడం గమనార్హం.

Covid fourth wave: భారత్‪కు మరో వేవ్ తప్పదా?

ఇదిలాఉంటే పంజాబ్ లోని పటియాలకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లాలో కరోనా కలకలం సృష్టించింది. 60 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్ గా నమోదైంది. దీంతో అధికారులు ఆ యూనివర్శిటీని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు.