Covid cases: భారత్‌లో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పదిరోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా పెరుగుతుండటంతో దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కొత్త కేసుల నమోదు సంఖ్య 3వేలు దాటగా..

Covid cases: భారత్‌లో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

Covid Cases

Covid cases: భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పదిరోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా పెరుగుతుండటంతో దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కొత్త కేసుల నమోదు సంఖ్య 3వేలు దాటగా.. శుక్రవారం అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 4,73,635 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,337 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారంతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగానే పెరిగినప్పటికీ.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరింది.

Covid cases : ఐదు రాష్ట్రాల్లో పెరిగిన కొవిడ్ కేసులు.. కేంద్రం కీలక ఆదేశాలు..

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 17,801కి చేరుకుంది. గడిచిన 24గంటల వ్యవధిలో 821 కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసుల రేటు 0.04గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 2,496 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గడిచిన 24గంటల వ్యవధిలో 60 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు 5.23లక్షల మంది కొవిడ్ భారినపడి మృతిచెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. గురువారం 22.80 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 188.65 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే 5 నుంచి 12ఏళ్లలోపు చిన్నారులకు కొవిడ్ టీకా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే శుక్రవారం 5-12 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నేడు స్పష్టత ఇచ్చే అవకాశాలున్నారు.