Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు

India Covid update

Coronavirus pandemic: దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో 1241 మంది మరణించారు.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 4 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 6 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరుకోగా.. అందులో 4,11,80,751 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,06,520 మంది చనిపోయారు. ప్రస్తుతం 7లక్షల 90వేల 789 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కేరళలో 23,253 కొత్త కేసులు:
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కరోనా విధ్వంసం కొనసాగుతోంది. ఇక్కడ 23,253 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు రాష్ట్రంలో 29,471 కరోనా కేసులు నమోదయ్యాయి.

171 కోట్ల డోస్‌లు:
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 171 కోట్ల యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ఇవ్వడం జరిగింది. గడిచిన 24గంటల్లో 46 లక్షల 44 వేల 382 డోసులు ఇవ్వగా, ఆ తర్వాత ఇప్పటివరకు 171కోట్ల 28 లక్షల 19 వేల 947 డోసుల వ్యాక్సిన్‌ అందించారు.