Corona Cases : దేశంలో కొత్తగా 7,171 కరోనా కేసులు, 40 మరణాలు

ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Corona Cases : దేశంలో కొత్తగా 7,171 కరోనా కేసులు, 40 మరణాలు

Corona Cases (1)

Corona Cases : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 7,171 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 40 మంది మృతి చెందారు. ఈ మేరకు శనివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 1,94,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,171 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశంలో 51,314 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9,669 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,43,56,693 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Covid-19 In Supreme Court : నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా

కరోనా వైరస్ తో కేరళలో 15 మంది, ఢిల్లీలో 6 మంది, ఉత్తర ప్రదేశ్ లో నలుగురు, చత్తీస్ గఢ్ లో ముగ్గురు, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఇద్దరు చొప్పున, మేఘాలయ, జమ్మూకాశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ లో ఒక్కొక్కరు చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 40 మంది మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు దేశంలో మృతుల సంఖ్య 53,1508కి చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్ గా ఉంది. రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.