COVID-19: డేంజర్ బెల్స్.. దేశంలో 40వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీగా కొత్తకేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8,329 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ శుక్రవారం 10మంది మరణించారు.

COVID-19: డేంజర్ బెల్స్.. దేశంలో 40వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..

Covid 19

COVID-19: దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీగా కొత్తకేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపినవివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 8,329 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ శుక్రవారం 10మంది మరణించారు.

Covid-19 : ప్రజలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలి-డీహెచ్ శ్రీనివాసరావు

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో గడిచిన 24గంటల్లో 8,329 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న 10మంది మరణించారు. ప్రస్తుతం కొవిడ్ తో చికిత్స పొందుతున్న 3,791 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం రికవరీ రేటు సుమారు 98.69 శాతంగా ఉంది. కొవిడ్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 40,370కి చేరింది. శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. యాక్టివ్ కేసులు 36,267గా ఉంది. గడిచిన 24 గంటల్లోనే యాక్టివ్ కేసులు 4,103 పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసులు 0.09 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

గడిచిన 24గంటల్లో 10 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,24,747కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో అత్యధికంగా కొత్తకేసుల నమోదు సంఖ్య ఇదే కావటం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా లో భారీగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.