India Covid 19 Cases : ఇండియాకు కాస్త రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

ఇండియాకు కాస్త రిలీఫ్. కరోనా కొత్త కేసులు కొంత తగ్గాయి. గడిచిన రెండు రోజులుగా 70వేలకు చేరువగా కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24గంటల్లో ఆ సంఖ్య

India Covid 19 Cases : ఇండియాకు కాస్త రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

India Corona

India Covid 19 Cases : ఇండియాకు కాస్త రిలీఫ్. కరోనా కొత్త కేసులు కొంత తగ్గాయి. గడిచిన రెండు రోజులుగా 70వేలకు చేరువగా కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24గంటల్లో ఆ సంఖ్య 56వేల 211గా నమోదైంది. మరో 271 మంది కరోనాకు బలయ్యారు. క్రితం రోజుతో(68వేల 020) పోల్చితే కొత్త కేసులు 17 శాతం మేర తగ్గాయి.

నిన్న ఒక్కరోజే 37వేల 028 మంది కొవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇప్పటివరకు 1,20,95,855 మందికి వైరస్ సోకగా..1,13,93,021 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 94.32 శాతంగా ఉంది. ఇక, దేశవ్యాప్తంగా 5లక్షల 40వేల 720 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.33గా ఉంది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 271 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మొత్తంగా 1,62,114 మంది మృత్యుఒడికి చేరగా..మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. మంగళవారం(మార్చి 30,2021) కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. క్రితం రోజు దేశవ్యాప్తంగా 68వేల 020 కరోనా కొత్త కేసులు, 291 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్ తో పాటు 8 రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 85శాతం ఈ 8 రాష్ట్రాల నుంచే ఉన్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 6కోట్ల మార్క్ దాటింది. మార్చి 29 నాటికి 6కోట్ల 11లక్షల 13వేల 354 మంది టీకాలు వేయించుకున్నారు. నిన్న 5లక్షల 82వేల 919 మందికి మాత్రమే టీకా డోసులు అందాయి.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ:
తెలంగాణలో నిన్న(మార్చి 29,2021) రాత్రి 8 గంటల వరకు 42వేల 461 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 463 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,07,205కి చేరింది. నిన్న కరోనాతో మరో నలుగురు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,694కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 364 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,00,833కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,678 యాక్టివ్‌ కేసుల్లో 1,723 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,00,95,487కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం(మార్చి 30,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలో కరోనా ఉగ్రరూపం:
రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ భారీగా కొత్త కేసులు పెరిగాయి. తాజాగా దాదాపు వెయ్యి కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 31వేల 325 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, 997 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8లక్షల 99వేల 812కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 181 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరంలో 4 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మార్చి 29,2021) బులెటిన్‌ విడుదల చేసింది.

ఇక, ఆరోగ్య శాఖ మరో షాకింగ్ విషయం చెప్పింది. 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు వెల్లడించింది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7వేల 210కి చేరింది. కాగా, ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం గమనార్హం.

అలాగే ఒక్క రోజులో కరోనా నుంచి 282 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6వేల 104కు పడిపోయాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,21,363 నమూనాలను పరీక్షించారు.