ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 70వేలకు చేరువగా కొత్త కేసులు, 5లక్షలు దాటిన యాక్టివ్ బాధితులు

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 70వేలకు చేరువగా కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా

ఇండియాలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 70వేలకు చేరువగా కొత్త కేసులు, 5లక్షలు దాటిన యాక్టివ్ బాధితులు

Corona Cases Have Increased Massively In India1

India Covid 19 Cases : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 70వేలకు చేరువగా కొత్త కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 68వేల 020 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 291మంది కరోనాకు బలయ్యారు. మొత్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య కోటి 20లక్షలు( 1,20,39,644) దాటింది. మొత్తం మరణాల సంఖ్య 1,61,843కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం (మార్చి 29,2021) వెల్లడించింది.

5లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
కొత్త కేసులు పెరుగుతూ ఉండటంతో యాక్టివ్ కేసులూ పెరిగాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల మార్కు దాటింది. ప్రస్తుతం 5లక్షల 21వేల 808 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ రేటు నాలుగు శాతం దాటింది. గడిచిన 24 గంటల్లో 32వేల 231మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోటి 13లక్షల పైచిలుకు మంది(1,13,55,993) కోవిడ్ ను జయించారు. రికవరీ రేటు 94.59 శాతానికి పడిపోయింది. ఇక, కరోనా వైరస్ టీకాల విషయానికొస్తే..మార్చి 28న కేవలం 2,60,653 మందికి మాత్రమే టీకా డోసులు అందాయి. ఇప్పటివరకు టీకా వేయించుకున్నవారి సంఖ్య 6,05,30,435కి చేరింది.

మహారాష్ట్రపై కరోనా పంజా:
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 40వేల 414 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 108మంది కోవిడ్ తో చనిపోయారు. దేశంలో మొత్తం కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. కొత్త కేసుల్లో మూడింట రెండొంతులు ఇక్కడే బయటపడ్డాయి. అలాగే ఆ ఒక్క రాష్ట్రంలోనే 3,27,241 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇప్పటివరకు 27,13,875 మందికి వైరస్ సోకగా..23,32,453 మంది దాన్నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫోకస్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా లాక్‌డౌన్‌ను ఎలా విధించాలో కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఒక్క ముంబైలోనే గడిచిన 24 గంటల్లో 6వేల 923 కరోనా కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది.

మొత్తం కరోనా కేసులు: 1,20,39,644
మొత్తం రికవరీలు: 1,13,55,993
యాక్టివ్ కేసులు: 5,21,808
మొత్తం కోవిడ్ మరణాలు: 1,61,843
ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య: 6,05,30,435