India Covid : దేశంలో కరోనా మరణ మృదంగం.. 3లక్షలు దాటిన మరణాలు, ప్రపంచంలో మూడోస్థానంలో ఇండియా

దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.

India Covid : దేశంలో కరోనా మరణ మృదంగం.. 3లక్షలు దాటిన మరణాలు, ప్రపంచంలో మూడోస్థానంలో ఇండియా

India Covid

India Covid Cases, Deaths : దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. తాజాగా 2.22లక్షల కొవిడ్‌ కేసులు నమోదవగా.. మరోసారి మరణాలు 4వేలు దాటాయి. కొత్తగా నమోదైన మరణాలతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్క్‌ను దాటాయి. కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగుతున్నది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

దేశంలో గడిచిన 24 గంటల్లో 2లక్షల 22వేల 315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం(మే 24,2021) తెలిపింది. మరో వైపు రోజువారీ కేసుల కంటే భారీగానే బాధితులు వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. నిన్న(మే 23,2021) 3లక్షల 02వేల 544 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో మరో 4వేల 454 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగింది. ఇప్పటి వరకు 2,37,28,011 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 3,03,720 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉంది.