India Covid : ఇండియాకు బిగ్ రిలీఫ్.. కరోనా తగ్గుముఖం, 2లక్షల దిగువకు కొత్త కేసులు

కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 2లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రితం రోజు నాలుగు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ మార్కుకు దిగువన నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం(మే 25,2021) వివరాలు తెలిపింది.

India Covid : ఇండియాకు బిగ్ రిలీఫ్.. కరోనా తగ్గుముఖం, 2లక్షల దిగువకు కొత్త కేసులు

India Covid

India Covid Cases : కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్ డౌన్ ప్రభావం చూపుతోంది. కరోనా కేసుల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 2లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. మరణాలు కూడా మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రితం రోజు 4వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ మార్కుకు దిగువన రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం(మే 25,2021) వివరాలు తెలిపింది.



సోమవారం(మే 24,2021) 20లక్షల 85వేల 112 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒక లక్షా 96వేల 427మందికి పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 14 తర్వాత ఆ స్థాయిలో తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి. ఇక 24 గంటల వ్యవధిలో 3వేల 511 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరగా..3,07,231 మంది ప్రాణాలు వదిలారు.



ఇక యాక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 25,86,782 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది. నిన్న 3,26,850 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.4 కోట్లకు పైబడ్డాయి. రికవరీ రేటు 88.69 శాతంగా కొనసాగుతోంది.