India Corona : దేశంలో కరోనా విలయం.. ఒక్కరోజే 4లక్షలకు చేరువలో కేసులు, 3వేలకు పైగా మరణాలు

దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 498మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24

India Corona : దేశంలో కరోనా విలయం.. ఒక్కరోజే 4లక్షలకు చేరువలో కేసులు, 3వేలకు పైగా మరణాలు

India Reports Record Corona Cases And Deaths 2

India Corona : దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరోసారి 3లక్షలకు పైగా కొత్త కేసులు, 3వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 86వేల 452 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 498మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2లక్షల 97వేల 540మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇదొక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. రోజురోజుకి కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 31.70లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 30,2021) ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో 3లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఇది వరుసగా 9వ రోజు. ఇక 3వేలకు పైగా మరణాలు నమోదవడం వరుసగా ఇది 3వ రోజు. దేశంలో ఏప్రిల్ 21న తొలిసారి రోజువారి కేసుల సంఖ్య 3లక్షల మార్క్ దాటింది. ఆ రోజు నుంచి నిత్యం 3లక్షలకు పైగానే కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఏప్రిల్ 27న తొలిసారిగా మరణాల సంఖ్య 3వేల మార్క్ దాటింది. నాటి నుంచి రోజూ 3వేలకు పైనే మరణాలు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 66వేల 159 కొత్త కేసులు బయటపడ్డాయి. 771 మంది కరోనాతో మరణించారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 6లక్షల 70వేల 301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 300లకు చేరువలో కరోనా మరణాలు సంభవించాయి.

దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఒక్కరోజే కరోనాతో రికార్డు స్థాయిలో 395మంది మరణించారు. ఒక్కరోజే 24వేల 235 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 32.82శాతంగా ఉంది. ఢిల్లీలో 300లకు పైగా కరోనా మరణాలు చోటు చేసుకోవడం ఇది వరుసగా 8వ రోజు కావడం గమనార్హం. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,22,286. వీరిలో 10.08 లక్షల మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 15వేల 772కి పెరిగింది.

మొత్తం కేసులు : 1,87,62,976
మొత్తం రికవరీలు : 1,53,84,418
మొత్తం మరణాలు : 2,08,330
యాక్టివ్ కేసులు : 31,70,228
వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య : 15,22,45,179