India Corona : భారత్‌లో కాస్త తగ్గిన కరోనా కేసులు, మరణాలు

భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే..

India Corona : భారత్‌లో కాస్త తగ్గిన కరోనా కేసులు, మరణాలు

India Corona

India Corona : భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే కేసులు, 4వేల లోపే మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,66,161 కేసులు నమోదయ్యాయి. మరో 3వేల 754మంది కరోనాకు బలయ్యారు. నిన్న ఒక్కరోజే 3లక్షల 53వేల 818మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు :  2,26,62,575

మొత్తం మరణాలు : 2,46,116
మొత్తం రికవరీలు : 1,86,71,222
యాక్టివ్ కేసులు : 37,45,237
ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య : 17,01,76,603

క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం(మే 9,2021) కేవలం 14.7లక్షల మందికే వైరస్‌ పరీక్షలు చేశారు. అంతక్రితం రోజున 18.6 లక్షల మంది టెస్టులు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 14,74,606 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా.. 3,66,161 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.2కోట్లకు చేరింది.

ఇదే సమయంలో మరో 3వేల 754 మంది కరోనాతో చనిపోయారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,46,116 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది. కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండటం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో 3,53,818 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.86కోట్లకు చేరగా.. రికవరీ రేటు 82.15శాతానికి పెరిగింది. ప్రస్తుతం 37,45,237 మంది కరోనా రోగులు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.76 శాతంగా ఉంది.

17కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌:
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కేవలం 6.89లక్షల మందికే టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 17.01 కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.