Patent Waiver On Covid Vaccines : భారత్ ప్రతిపాదనకు జీ-7 మద్దతు..కోవిడ్ వ్యాక్సిన్లపై పేటెంట్​ హక్కుల రద్దు!

యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్​ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా​ చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Patent Waiver On Covid Vaccines :  భారత్ ప్రతిపాదనకు జీ-7 మద్దతు..కోవిడ్ వ్యాక్సిన్లపై పేటెంట్​ హక్కుల రద్దు!

Modi (1)

Patent Waiver On Covid Vaccines యూకేలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో కోవిడ్-19 వ్యాక్సిన్లపై పేటెంట్​ హక్కుల తాత్కాలిక రద్దు చేయాలని భారత్-దక్షిణాఫ్రికా​ చేసిన ప్రతిపాదనకు పెద్దఎత్తున మద్దతు లభించినట్లు ఆదివారం భారత విదేశాంగ శాఖ తెలిపింది.

జీ-7 సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రతిపాదనను ప్రముఖంగా ప్రస్తావించారని విదేశాంగ శాఖ తెలిపింది. పేటెంట్​ హక్కులపై మోదీ ఇచ్చిన పిలుపునకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రామాఫోసా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​, ప్రపంచ వాణిజ్య సంస్థ అధినేత్రి నగోజీ ఒకోంజో, ఐక్యరాజ్య సమితి డైరక్టర్ జనరల్​ ఆంటోనియో గుటెరస్​లు మద్దతు తెలిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

ఇక,జీ-7 కూటమికి భారత్ సహజ భాగస్వామి అని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జీ-7 శిఖరాగ్ర సమావేశంలో నిర్వహించిన ‘ఓపెన్​ సొసైటీస్​- ఓపెన్​ ఎకానమీస్​’ అనే అంశంపై వర్చువల్​గా ప్రసంగించిన మోదీ.. ప్రజాస్వామ్యం, ఆలోచనా స్వేచ్ఛ పట్ల భారతదేశ నాగరికతకు ఉన్న నిబద్ధతను వివరించారు. భారత్​లో ఆధార్​, ప్రత్యక్ష నగదు బదిలీ విధానం, జన్​ధన్​-ఆధార్​-మొబైల్​ వంటి అప్లికేషన్స్​తో దేశంలో వచ్చిన మార్పును జీ-7 దేశాలకు వివరించారు. ఉగ్రవాదం, అధికార దాహార్తి, ఆర్థిక నేరాలను ఎదురుక్కోవడంలో జీ-7 దేశాలకు భారత్​ సహకారం కొనసాగుతుందని ప్రధాని మోదీ అన్నారు

మరోవైపు, పేద దేశాలకు బిలియన్ కరోనా టీకా డోసులను ఇవ్వాలని జీ7 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఇంగ్లండ్‌లో మూడు రోజులపాటు జరిగిన జీ7 నేతల సదస్సు ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ.. టీకాలను నేరుగా, అంతర్జాతీయ కొవాక్స్ కార్యక్రమం ద్వారా రెండు విధాలుగానూ అందించనున్నట్టు చెప్పారు. బ్రిటన్ ప్రధాని జాన్సన్ పేర్కొన్న బిలియన్ టీకా డోసుల్లో సగం అమెరికా ఇవ్వనుండగా, 100 మిలియన్ డోసులను బ్రిటన్ ఇవ్వనుంది. జీ7 దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా ఉన్నాయి.