India Covid Cases : ఇండియాకు బిగ్ రిలీఫ్.. తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు.. పెరుగుతున్న రికవరీలు

కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా మూడోరోజు మరణాలు నాలుగు వేలకు దిగువనే నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం(జూన్ 29,2021) బులెటిన్ విడుదల చేసింది.

India Covid Cases : ఇండియాకు బిగ్ రిలీఫ్.. తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు.. పెరుగుతున్న రికవరీలు

India Corona

India Covid Cases : కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా మూడోరోజు మరణాలు నాలుగు వేలకు దిగువనే నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం(జూన్ 29,2021) బులెటిన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా శుక్రవారం(మే 28,2021) 20లక్షల 80వేల 048 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..ఒక లక్ష 73వేల 790 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొదటిసారి 45రోజుల తర్వాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అలాగే 24గంటల వ్యవధిలో 3వేల 617మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు సంఖ్య 2.77 కోట్లకు పైబడగా.. కరోనా కాటుకు 3లక్షల 22వేల 512 మంది బలయ్యారు.

వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి రావడంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 22లక్షల 28వేల 724 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీలరేటు 8.50శాతానికి చేరింది. రికవరీ రేటు 90.34శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 2.5కోట్లమందికి పైగా వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 2లక్షల 84వేల 601 మంది కోలుకున్నారు. వరుసగా 16వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.