2021లో భారత్ చేపట్టే వరుస మిస్సైల్స్, డ్రోన్లు, మిలటరీ ట్రయల్స్‌ ఏంటంటే?

2021లో భారత్ చేపట్టే వరుస మిస్సైల్స్, డ్రోన్లు, మిలటరీ ట్రయల్స్‌ ఏంటంటే?

Drones To Missiles, List Of Military Trials In 2021 : కొత్త ఏడాది 2021లో భారత్ వరుస మిలటరీ టెస్టులు, ట్రయల్స్ ప్లాన్ చేస్తోంది. 2020 ఏడాది భారతీయ రక్షణ ఆయుధాల అభివృద్ధికి అద్భుతమైన సంవత్సరంగా చెప్పాలి. దేశీయ అత్యంత ప్రతిష్టాత్మకమైన రాఫెల్ టెస్టింగ్ నుంచి మిస్సైల్ టెస్టింగ్, తుపాకుల వ్యవస్థ, రక్షణ సామాగ్రితో రికార్డు స్థాయిలో పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. స్వీయ రక్షణలో శక్తివంతమైన దేశమనే హోదాను భారత్ సాధించింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 2021 ఏడాదిలోనూ భారత్ వరుసగా మిలటరీ టెస్టులు, ట్రయల్స్ దిశగా ప్లానింగ్ చేసింది. 2021 ఏడాది మొత్తం రక్షణపరమైన అభివృద్ధి కార్యకలాపాలన్ని ‘ఆత్మనిర్భార్ భారత్’ నినాదంతోనే ముందుకు సాగనున్నాయి. 2020లో అన్ని డీఆర్డ్ఓ సాధించిన అన్ని విజయాలను కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలని భావిస్తోంది.

2021 ఏడాదిలో ప్రధానంగా బాలిస్టిక్ క్షిపణి రక్షణ (BMD) షీల్డ్, జలాంతర్గాముల కోసం ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) వ్యవస్థ, 800 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్, డ్రోన్‌లతో పాటు సబ్ మెరైన్లు, మిలటరీ టెస్టులు, మిస్సైల్స్ ట్రయల్స్ హైలెట్ గా నిలువనున్నాయి. సాంప్రదాయిక జలాంతర్గాములు ఎక్కువ కాలం నీటిలో ఉండటానికి అనుమతించే స్వదేశీ AIP కోసం టెస్టులను కొత్త ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. స్వదేశీ రుస్టోమ్ 2 మానవరహిత వైమానిక వాహనం (UAV) పూర్తి స్థాయి ట్రయల్ జరుగనుంది. 2021 మొదటి భాగంలో ఈ ట్రయల్ ప్రారంభం కానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద సాయుధ UAVలను ఎగుమతి చేసే దేశాలలో ఒకటిగా చెప్పవచ్చు. 2021 ప్రారంభంలో 800-1,000 కిలోమీటర్ల పరిధిని కలిగిన స్వదేశీ టెక్నాలజీ క్రూయిస్ క్షిపణి (ITCM) నిర్భయ్ ట్రయల్స్ చేపట్టనుంది. 800 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి తొలి ట్రయల్ జరుగనుంది. 2021 మధ్యలో ఈ ట్రయల్ జరగనుంది.

కరోనావైరస్ మహమ్మారి మందకొడిగా కొనసాగింది, కానీ సెప్టెంబరు తరువాత వేగం పెరిగింది. 2020లో జరిగిన ప్రధాన టెస్టుల్లో.. సెప్టెంబర్ 7న హైపర్సోనిక్ టెక్నాలజీ డెమన్‌స్ట్రేటర్ వెహికల్ (HSTDV) టెస్టు విజయవంతమైంది. అమెరికా, చైనా, రష్యా తరువాత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రపంచ దేశాల్లో భారతదేశం నాల్గొదిగా నిలిచింది. అక్టోబర్ 9న, కొత్త తరం యాంటీ రేడియేషన్ క్షిపణి (RUDRAM) ఒడిశా తీరంలో రేడియేషన్ విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణిని Su-30MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. 2020 సంవత్సరంలో క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి (QRSAM) నవంబర్ 13న మైలురాయిని చేరుకుంది.