సచిన్ సూచన: పాక్‌తో ఆడాలి.. చిత్తుగా ఓడించాలి

పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్‌పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 03:11 AM IST
సచిన్ సూచన: పాక్‌తో ఆడాలి.. చిత్తుగా ఓడించాలి

పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్‌పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల

పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్‌పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల నుంచి పాక్‌పై  ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆర్థిక, వాణిజ్య, దౌత్య రంగాల్లో పాక్‌ను దెబ్బకొట్టేందుకు భారత్ వ్యూహం రచిస్తోంది. అదే సమయంలో క్రీడల్లోనూ పాక్‌ను బాయ్‌కాట్ చేయాలనే  డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు క్రీడల్లో పాక్‌తో రిలేషన్స్ కట్ చేశారు.

ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో భారత్‌ ఆడకూడదని కొందరు, ఆడాల్సిందే అని మరికొందరు క్రీడా ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం  చేస్తున్నారు. దీనిపై క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. పాక్‌తో భారత జట్టు క్రికెట్ ఆడకూడదన్న ఆలోచనను సచిన్‌ వ్యతిరేకించారు. ఆడకుండా ఆ రెండు జట్లకు 2  పాయింట్లు ఇచ్చేయడం సరికాదని చెప్పారు. భారత్‌ ఆడకపోతే అది పాకిస్తాన్‌కే లాభమని సచిన్‌ తేల్చారు. పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే బదులు ఆడి ఆ జట్టును ఓడించడం మంచిదన్నారు.  క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

వరల్డ్ కప్ చరిత్రను సచిన్ గుర్తు చేశారు. వరల్డ్ కప్‌లో దాయాది దేశం పాక్‌పై ఎప్పుడూ భారత్‌దే విజయమని చెప్పారు. మరోసారి ఆ జట్టును ఓడించాల్సిన సమయమిది అన్నారు. ప్రపంచకప్‌లో  ఆ జట్టుతో ఆడకుండా 2 పాయింట్లు ఇచ్చేయడానికి తాను వ్యతిరేకం అన్నారు. అదే సమయంలో అంతిమంగా అన్నింటికన్నా దేశమే ముఖ్యం అన్న సచిన్.. దేశం ఏ నిర్ణయం తీసుకున్నా  సంపూర్ణ మద్దతిస్తా అని స్పష్టం చేశారు.

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలని హర్భజన్‌, మరికొందరు ఆటగాళ్లు డిమాండ్‌ చేశారు. అలా చేస్తే భారత్‌కే నష్టం అని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డ సంగతి  తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలోకి సచిన్ కూడా చేరారు. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడాలని.. చిత్తు చిత్తుగా పాక్‌ను ఓడించి వీర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించాలని చాలామంది క్రికెట్  ఫ్యాన్స్ కోరుతున్నారు.