బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్

  • Published By: venkaiahnaidu ,Published On : October 18, 2020 / 04:47 PM IST
బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్

Brahmos supersonic cruise missile భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని ఇండియన్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ INS చెన్నై యుద్ధ నౌక నుంచి ఆదివారం ఈ ప్రయోగం చేపట్టారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది.



బ్రహ్మోస్ ప్రైమ్ స్ట్రైక్ ఆయుధం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నౌకాదళం ద్వారా సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను చేధించడం ద్వారా యుద్ధనౌక యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుందని డీఆర్డీవో తెలిపింది. క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్..​ డీఆర్​డీఓ,బ్రహ్మోస్,ఇండియన్ నేవీ అధికారులను అభినందించారు.



బ్రహ్మోస్ క్షిపణులు భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెంచుతాయని DRDO చైర్మన్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించగలవు.