DRDO : స్మార్ట్ మిసైల్ పరీక్ష విజయవంతం

సూదూర ల‌క్ష్యాల‌ను ఛేదించ‌గ‌ల‌ సూప‌ర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(SMART)ను

DRDO : స్మార్ట్ మిసైల్ పరీక్ష విజయవంతం

Smart

DRDO : సూదూర ల‌క్ష్యాల‌ను ఛేదించ‌గ‌ల‌ సూప‌ర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెట్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(SMART)ను సోమవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా రాష్ట్రంలోని బాల‌సోర్ టెస్ట్ రేంజ్ నుంచి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) ఈ స్మార్ట్ మిసైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. పరీక్షలో క్షిపణి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగిందని.. డీఆర్​డీఓ అధికారులు తెలిపారు.

యాంటీ స‌బ్‌మెరైన్ వార్‌ఫేర్ సామ‌ర్థ్యాన్ని సాంప్ర‌దాయ ప‌రిధి కంటే మ‌రింత విస్త‌రించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్మార్ట్ మిసైల్ వ్య‌వ‌స్థను డిజైన్ చేసిన‌ట్లు డీఆర్‌డీవో తెలిపింది. చాలా దూరంలో ఉన్న జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం ఈ క్షిపణికి ఉన్నట్లు డీఆర్​డీఓ అధికారులు తెలిపారు. భారత నేవీ ఆయుధ వ్యవస్థ కోసం ఈ క్షిపణిని రూపొందించామన్నారు.

శుత్రదేశాల జలాంతర్గాముల ఉనికిని ముందుగానే పసిగట్టి.. వాటిపై ఈ సూపర్‌సోనిక్‌ క్షిపణి టార్ఫిడోలను ప్రయోగిస్తుందని డీఆర్‌డీవో తెలిపింది . భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా జలాంతర్గాముల్లో పైనుంచి టార్ఫిడోలను ప్రయోగించేందుకు వీలుగా.. ఈ క్షిపణి వ్యవస్థను రూపొందించారు.