Agni V missiles: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం.. రాత్రిపూట ప్రయోగించిన భారత్

భారత రక్షణ శాఖ చేపట్టిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది.

Agni V missiles: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం.. రాత్రిపూట ప్రయోగించిన భారత్

Agni V missiles: అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలిగే అగ్ని-5 క్షిపణిని భారత రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒకవైపు సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ భారత్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అగ్ని-5 పరీక్ష విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.

Viral Tweet: హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు.. తండ్రికి పంపిన మెనూ లిస్ట్ చూస్తే షాకవ్వడం ఖాయం

ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ప్రయోగ కేంద్రం నుంచి రాత్రిపూట ఈ క్షిపణుల్ని ప్రయోగించారు. ఇది నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేధించిందని అధికారులు తెలిపారు. ఇది అగ్ని-5 క్షిపణులకు సంబంధించి చేపట్టిన తొమ్మిదో ప్రయోగం. తొలిసారిగా దీన్ని 2012లో ప్రయోగించారు. ఈ క్షిపణిని కొత్త టెక్నాలజీ, కొత్త పరికరాలు ఉపయోగించి తయారు చేశారు. ఈ క్షిపణి 5,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. భవిష్యత్తులో దీని సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు ఈ పరీక్ష ఉపయోగపడనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఇంతకుమించిన వివరాలేవీ రక్షణ శాఖ వెల్లడించలేదు.