India : చైనాకు చెక్ పెట్టి.. తైవాన్ తో ఒప్పందం చేసుకున్న భారత్
చిప్ సెట్ల విషయంలో చైనాకు చెక్ పెట్టె నిర్ణయం తీసుకుంది. తైవాన్ తో కలిసి భారీ చిప్ సెట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

India : అంతర్జాతీయ మార్కెట్లో చిప్ సెట్ల కొరత తీవ్రంగా ఉంది. చిప్ సెట్ల కొరత వలన అనేక పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇంతకాలం భారత్ చిప్ సెట్ల కోసం చైనాపై ఆధారపడింది. ప్రస్తుతం చైనా భారత్ మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో భారత్ ప్రత్యామ్న్యాయ మార్గాలను వెతుకుతుంది. ఈ నేపథ్యంలోనే చిప్ సెట్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ.. అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్న తైవాన్ తలుపు తట్టింది. సాంకేతిక రంగంలో తైవాన్ ప్రాధాన్యతను గుర్తించి ఈ మేరకు భారత్ తరఫున ఇటీవల అధికారుల బృందం తైపీలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
Read More : Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?..
ఒప్పందం
భారత్, తైవాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాలు బాహాటంగా ప్రకటించలేదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 7.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఇండియాలో చిప్ ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరిశ్రమ ఏర్పాటు కావలసిన సహాయ సహకారాలను అందుకునేందుకు భారత్ సిద్ధమైంది. చిప్ సెట్ల తయారీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
తైవాన్, భారత ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 50 శాతం వ్యయం భారత ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ట్యాక్సుల్లో కూడా మినహాయింపు ఇస్తుంది. తైవాన్ సంస్థ నెలకొల్పే చిప్ తయారీ పరిశ్రమలో 5జీ టెక్నాలజీకి సంబంధించిన చిప్‌సెట్ల నుంచి కారు తయారీ వరకు ఉపయోగించే అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్‌ని తయారు చేస్తారు.
Read More : Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!
ప్రస్తుతం తైవాన్, చైనా మధ్యకూడా సంబంధాలు సరిగా లేవు. చిన్న దేశమైన తైవాన్ మీదకు యుద్ధవిమానాలు పంపుతూ భయపెడుతోంది చైనా. అయితే తైవాన్‌కి అండగా అమెరికా నిలబడింది. చైనా ఇటువంటి చర్యలు ఆపాలని గట్టిగ హెచ్చరించింది.