Bipin Rawat : రావత్ దంపతులకు భారతావని కన్నీటి వీడ్కోలు

ఆయువున్నంత వరకు భరతమాత సేవలో తరించిన సీడీఎస్ బిపిన్ రావత్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పిస్తోంది. రావత్, ఆయన సతీమణి మధూలికరావత్‌కు ప్రతీ భారతీయుడు వీడ్కోలు పలుకుతున్నాడు.

Bipin Rawat : రావత్ దంపతులకు భారతావని కన్నీటి వీడ్కోలు

Bipin Rawat (1)

farewell to Bipin Rawat couple : ఆయువున్నంత వరకు భరతమాత సేవలో తరించిన సీడీఎస్ బిపిన్ రావత్‌కు యావత్ భారతావని కన్నీటి నివాళులర్పిస్తోంది. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలికరావత్‌కు ప్రతీ భారతీయుడు కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నాడు. రావత్ దంపతుల భౌతికకాయాలకు ఆర్మీ, రాజకీయ, న్యాయ ప్రముఖులు నివాళులర్పించారు.

ఉదయం ఆర్మీ ఆస్పత్రి నుంచి రావత్ దంపతుల భౌతికకాయాలను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచారు. రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రముఖులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు రావత్‌ దంపతుల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. భుటాన్‌, శ్రీలంక, నేపాల్‌ సైనిక ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు.

Chopper Crash : ఎలాంటి సమాచారం లేకుండా..ఊహాగానాలు వద్దు – వైమానిక దళం ప్రకటన

కాసేపట్లో త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నత ఆర్మీ అధికారులు రావత్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.. ఆర్మీ అధికారులు నివాళులర్పించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభం కానుంది.. సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి.

బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. ఆర్మీ 17 గన్ సెల్యూట్‌ ఇవ్వనుంది. ఫ్రంట్‌ ఎస్కార్ట్‌గా 120మంది త్రివిధ దళ సభ్యులు ఉంటారు. అంత్యక్రియల్లో 800మంది సర్వీస్‌ మెన్‌ పాల్గొంటారు. సీడీఎస్‌ రావత్‌కు త్రివిధ దళాలు సగౌరవంగా వీడ్కోలు పలకనున్నాయి.